- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ మరాఠీ నాటకరంగ దిగ్గజం, దర్శకురాలు, నటి విజయ మెహతా (91) మంగళవారం తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆధునిక భారతీయ నాటకరంగం, సినిమా రంగానికి ఆమె చేసిన సేవలు మరువలేనివి. ఆమెను అందరూ ముద్దుగా ‘బాయి’ అని పిలుచుకునేవారు. నటుడు అనుపమ్ ఖేర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వార్తను పంచుకున్నారు. ‘రావు సాహెబ్’, ‘పెస్టోంజీ’ చిత్రాలలో ఆమెతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను ఆయన గుర్తుచేసుకున్నారు.
- Advertisement -



