- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: భారత్ పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని సనే తకైచి బుధవారం సాయతంత్రం ఢిల్లీకి చేరుకోనున్నారు. 16వ భారత్ – జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ఆమె పాల్గొనున్నారు. ఆమె పర్యటన జూలై 1 నుంచి 3 వరకు జరగనుందని జపాన్ విదేశాంగ శాఖ ఎక్స్ పోస్టులో పేర్కొంది. కాగా, తకైచి పర్యటనతో భారత్ – జపాన్‌ల మధ్య ద్వైపాక్షిక, ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని భావిస్తున్నారు. అలాగే సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలు వంటి రంగాలలో పటిష్టమైన సరఫరా గొలుసులను నిర్మించే ప్రయత్నాలకు ఊపునిస్తుందని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు.
- Advertisement -



