Saturday, February 28, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిమల్లన్న జాతరలో నా శవయాత్ర

మల్లన్న జాతరలో నా శవయాత్ర

- Advertisement -

తల్లి గర్భమే క్షేమం
పుడమిపై కాటేసింది కులం
తొమ్మిది నెలలు ఏ అంటుముట్టు లేదు
నేలపై పడగానే అన్నీ ఆంక్షలే..
నీకు ఎన్ని మొక్కలు మొక్కితే..
నా తల్లి కడుపులో నలుసునయ్యానో..
రెండు నెలలకే మొక్కు చెల్లించుకున్నావో..
నరదిష్టి తగలకుండా కాటుక పెట్టుకున్న
కులదిష్టిని అడ్డుకోలేకపోయా..
నీ సన్నిధిలో దోపిడీని ప్రశ్నించడం నేరమైంది
కుల అహంకారంతో నన్ను చిదిమేసింది
కాళ్లతో కసితీరా తొక్కుతుంటే కనికరం కలగలేదా..
పసిగుడ్డును దూరంగా విసిరేస్తుంటే..
జోల పట్టలనిపించలేదా..
నా తల్లి కుల గోడల్నీ దాటినందుకు..
ప్రేమకు దూరమైంది, బిడ్డకూ దూరమైంది
ఇప్పుడు ఒంటరై రోదిస్తోంది..
ఊపిరిగా నేను మలినమైన చోట
మృతదేహామై పడివున్నా..
ఇప్పుడు, నీ జాతర ఎంత పవిత్రమైనదో ‘మల్లన్న’
నా ప్రశ్న ఎంత బలమైనదో ‘మల్లన్న’
అందుకే.. పెత్తందారీ అహం దెబ్బతిన్నది
కులరాకాసి పేట్రేగి నన్ను బలితీసుకున్నది
– ఏ.అజయ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -