Wednesday, July 1, 2026
E-PAPER
Homeఆదిలాబాద్దేవునిగూడలో పామాయిల్ సాగుపై అవగాహన

దేవునిగూడలో పామాయిల్ సాగుపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ-జన్నారం
మండల పరిధిలోని దేవునిగూడ గ్రామంలో పామాయిల్ తోటల సాగుపై రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాట్రిక్స్ కంపెనీ సీఈఓ ఉదయ్ కుమార్  హాజరై, రైతులకు పామాయిల్ సాగు విధానాలు, యాజమాన్య పద్ధతులు మరియు దాని ద్వారా లభించే లాభాలపై అవగాహన కల్పించారు. తక్కువ పెట్టుబడితో, దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయాన్నిచ్చే పామాయిల్ పంట వైపు రైతులు మొగ్గు చూపాలని ఆయన కోరారు.

​ఈ కార్యక్రమంలో మాట్రిక్స్ కంపెనీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఎంబడి కవిత గారితో పాటు గ్రామ రైతులు గుర్రం గోపాల్ రెడ్డి, కల్లెం బాబు రెడ్డి, కల్లెం తిరుపతి రెడ్డి, కల్లెం లచ్చిరెడ్డి, సింగిరెడ్డి సుధాకర్ రెడ్డి, గుర్రం గంగారెడ్డి, కల్లెం ప్రవీణ్ రెడ్డి, తోట మధాకర్, ఆచే వెంకటేష్, మునిగెల భూచన్న, గూడ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -