నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో బుధవారం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కమ్మర్పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కమ్మర్ పల్లి, చౌట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు డాక్టర్ నరసింహ స్వామి, డాక్టర్ హసీనా, డాక్టర్ స్పందన లను ఘనంగా లయన్స్ క్లబ్ సభ్యులు సత్కరించారు.వైద్యులకు శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి వారి సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తెడ్డు రమేష్ మాట్లాడుతూ సమాజ ఆరోగ్య పరిరక్షణలో వైద్యులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని, వారి అంకితభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఎండి హైమద్, కోశాధికారి సుంకరి విజయ్ కుమార్, క్లబ్ సభ్యులు పాలేపు నర్సయ్య, చింత ప్రదీప్, సూరంగి చంద్రశేఖర్, నోముల నరేందర్, సున్నం మోహన్, సింగరి రాజేశ్వర్, సుర నర్సయ్య, వైద్య సిబ్బంది, పెంట కిషన్, తదితరులు పాల్గొన్నారు.



