- Advertisement -
నవతెలంగాణ-పెద్దవంగర
స్కూల్ బస్, బైక్ ఎదురెదురుగా ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన మండల పరిధిలోని రెడ్డికుంట తండా శివారులో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డికుంట తండాకు చెందిన బానోత్ అనిల్ వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లి రామచంద్రు తండా మీదుగా ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్ ఢీకొట్టింది. దీంతో అనిల్ కాలుకు తీవ్ర గాయాలు కావడంతో గమనించిన స్థానికులు వైద్యం నిమిత్తం తొర్రూరు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -



