– ఉపాధి కూలీలకు వీబీజీ రాంజీ పధకం విఘాతం
– ఎంజీఎన్ఆర్ఈజీఏ నే కొనసాగించాలి
– ఏఐఏడబ్ల్యుయూ – సీఐటీయూ – ఏఐకేఏస్ ఆద్వర్యంలో వినతులు
– పాల్గొన్న రైతు సంఘం రాష్ట్ర నాయకులు పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
వీబీ-జీ-రామ్-జీ – 2025(వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)” అనే కొత్త చట్టాన్ని కేంద్రం 1 జులై 2026 నుంచి అమలు చేయనుండటంతో దాన్ని నిలుపుదల చేయాలని ఏఐఏడబ్ల్యుయూ – సీఐటీయూ – ఏఐకేఏస్ సంఘాల ఆద్వర్యంలో బుధవారం ఆయా పంచాయతీ ల కార్యదర్శులు కు, సర్పంచ్ లు కు వినతులు అందజేశారు. ఈ నేపథ్యంలో మండలం లోని నందిపాడు పంచాయతీ లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్త పధకం తో ఉపాధి కూలీలకు సరైన కూలీ పడదు అని,పాత పద్ధతి లోనే చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి హామీ కల్పించాలని డిమాండ్ చేశారు. వేదాంతపురంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు చిరంజీవి,కోయరంగాపురంలో సీపీఐ ( ఎం) మండల కార్యదర్శి సోడెం ప్రసాద్, అల్లిగూడెం లో మున్సిపల్ క్రిష్టియన్ మైనారిటీ కో – ఆప్షన్ కౌన్సిలర్ తగరం నిర్మల,నారంవారిగూడెం లో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు ముల్లగిరి గంగరాజు,మండల కమిటీ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు,నారం అప్పారావు, వెంకటేశ్వరరావు,కలపాల భద్రం , మడకం గోవిందు,కుంజ మురళీ లు పాల్గొన్నారు.



