Thursday, July 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపర్యావరణ పరిరక్షణ కోసం..

పర్యావరణ పరిరక్షణ కోసం..

- Advertisement -

కోటి మొక్కల రామయ్యగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పర్యావరణ ఉద్యమకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి దరిపల్లి రామయ్య సేవలను చిరస్థాయిగా నిలబెట్టే ఉద్దేశంతో రూపొందిన లఘుచిత్రం ‘వనజీవి రామయ్య`. ఈ మూవీ టీమ్, వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వనజీవి అవార్డు పురస్కార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వనజీవి రామయ్య జయంతిని పురస్కరించుకుని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ కోసం విశేషంగా కృషి చేస్తున్న స్వచ్ఛంద సేవకులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని పల్లె ప్రకృతి వానలకు వనజీవి రామయ్య పేరును పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ అలాగే పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా రూపొందిస్తున్నామని నిర్మాత నిడిగొండ నరేష్ ప్రజాపతి ప్రకటించారు. దర్శకుడు వేముగంటి మాట్లాడుతూ, ‘దాదాపు ఏడు దశాబ్దాల పాటు తన జీవితాన్నే మొక్కల కోసం అంకితం చేసిన వనజీవి రామయ్యను భావితరాలు ఎన్నటికీ మరచిపోకూడదు. ఆయన సేవలు, జీవన తత్వం ప్రతి ఒక్కరికీ చేరాలనే లక్ష్యంతో ‘వనజీవి రామయ్య’ చిత్రాన్ని రూపొందించాం. ఈ సినిమా ద్వారా పర్యావరణ పరిరక్షణపై మరింత అవగాహన కలుగుతుందని ఆశిస్తున్నాం” అన్నారు. వాస్విక్ ఫౌండేషన్ సభ్యులు నూకల నర్సింహారెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ మల్లిక్ తేజ, మాజీసైనికులు వెంకట అప్పారావు, విశ్వనాథ సింగరేణి రిటైర్డ్ జీఎం, వినయ్ రెడ్డి, మహేంద్ర వర్మ, నవీన్, సాహిత్య, సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -