Wednesday, July 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసర్ర్పైజ్ చేసే విజువల్ వండర్

సర్ర్పైజ్ చేసే విజువల్ వండర్

- Advertisement -

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కు తున్న సినిమా ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈనెల 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. నిర్మాత సురేష్ బాబు ఈ వేడుకకు ముఖ్య అతిథి గా హాజరయ్యారు. హీరో విరాట్ కర్ణ మాట్లా డుతూ,’ నటుడిగా మీ అందరి గుండెల్లో స్థానం సంపాదించు కోవడానికి ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాను. నాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చిన అభిషేక్ కి జీవితాంతం రుణపడి ఉంటాను. ఆయన అద్భుతంగా ఈ సినిమాను తీశారు. ఈ సినిమాలో ప్రతిదీ ఒక అద్భుతంలా కనిపిస్తుంది. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఇందులో మీరు చూస్తారు. మా నిర్మాతలు సినిమాను అద్భుతంగా నిర్మిం చారు. అనంత పద్మనాభస్వామి రథయాత్ర ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో మీరందరూ చూస్తు న్నారు. ఇది కేవలం ఒక సినిమా కాదు. ఒక ఎక్స్ పీరియన్స్. మన భారతీయ సంస్కృతిని, వార సత్వాన్ని సెలబ్రేట్ చేసుకునే సినిమాఅని తెలిపారు. 'అభిషేక్ అద్భుతంగా ఈ సిని మాను తీశాడు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కూడా చాలా చక్కని వర్క్ ఇచ్చారు. ఇది చాలా కాస్ట్లీగా తీసిన సినిమా. నేను రషెస్ చూశాను. అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేశారు. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని నిర్మాత సురేష్ బాబు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -