Thursday, July 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతొలి తెలుగు ఏఐ సినిమా

తొలి తెలుగు ఏఐ సినిమా

- Advertisement -

తెలుగు సినీ పరిశ్రమలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ తొలి తెలుగు ఏఐ సినిమాగా ‘అంబస్ రివెంజ్' ముస్తాబవుతోంది. నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్‌పై యోగేంద్ర పొట్లూరి, రాణి మాడిసన్ నిర్మిస్తుండగా, జయవర్ధన్ మడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఐ విజువల్ డిజైన్ , డెవలప్‌మెంట్‌ను కాలై విజువల్ స్టూడియోస్ అందిస్తోంది. భారతీయ ఇతిహాసమైన మహా భారతంలోని శక్తివంతమైన పాత్ర అంబ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పురాణ గాథను ఆధునిక దృక్పథంతో, అత్యాధునిక ఏఐ సాంకేతికతను మేళవించి వినూత్నంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా నిర్మాత యోగేంద్ర పొట్లూరి, దర్శకుడు జయవర్ధన్ మడి మాట్లాడుతూ, 'తెలుగు సినిమాకు ఇది ఒక కొత్త ప్రయో గాత్మక అధ్యాయానికి నాంది. చిత్ర నిర్మాణంలోని పలు దశల్లో ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నాం. ముఖ్యంగా విజువల్ డిజైన్, పాత్రల రూపకల్పన, కథా రూపాంతరం వంటి అంశాల్లో ఆధునిక ఏఐ సాధనాలను ఉపయోగించడం ద్వారా వినూత్న కథనాన్ని ఆవిష్కరిస్తున్నాం. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాం అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -