Wednesday, July 1, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిరైతు దిగులు

రైతు దిగులు

- Advertisement -

అరకొర వానల తండ్లాటతో
రైతు ముఖంలో కరువు ఛాయలు
విత్తు విత్తలేని అయోమయంలో
సత్తువ లేని భూమికి ఇక్కట్లు
ఎడతెరిపి లేని ఎండ పెత్తనంతో
ఊపిరి తిరగని చెరువు తిప్పలు
దుక్కిలేని నేల దుఃఖపు పొరల్లో
కలుపు మొక్కల కేరింతలు
ఎరువు దొరికినా ఫలితం లేదని
పొడిబారిన సాలళ్ల ఆవేదనలు
తడిలేని తహతహలతో కాలువలు
మరణ మృదంగపు వాయిద్యాలు
రైతు బతుకులో కెరటాలై ఎగస్తూ
అరువు సంద్రంలో మునకలు
ఆర్థిక భారంతో తలకు బరువు
తీర్చలేని స్థితి గతుల గోతులు
పైపై నవ్వుల చిట్లింపులతో
లోలోపల రైతు ఆవేదన సెగలు
కొలిక్కి రాని వర్ష రుతువులతో
తికమకల మకతికలతో అగచాట్లు
ఊహించని వాతావరణంతో
పాలుపోని ముంగారు సేద్యాలు
కరువు నీడల వేటా మార్గంలో
రైతన్నలు భయంతో వలసలు
చెట్టు నీడలేని ఒట్టి మోడులతో
కందిపోతున్న దేహాల
హాహాకారాలు
పొంచివున్న ముప్పు మునకలతో
తరుముకు వస్తున్న ఆందోళనలు
రైతుల బతుకు గమ్యాల దారిలో
ఏమైతుందో తెలియని దిగులు
ఎటు వెళుతుందో తోచని వైనాలు
నరెద్దుల రాజారెడ్డి,
9666016636

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -