శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రజా సమస్యలపై చర్చలే లేకుండా చప్పగా ముగిశాయి. ప్రధాన ప్రతిపక్షం గులాబీ పార్టీకి చెందిన సభ్యులే లేకుండా వార్ వన్ సైడ్ అన్నట్టు అధికార పార్టీ ఏకపక్షంగా సభను నడిపించింది. మధ్యలో బీఆర్ఎస్ సభ్యులు లేని లోటును బీజేపీ పూరించింది. గులాబీ పార్టీ తరపున వకాల్తా పుచ్చకుని… దాని గళాన్ని వినిపిస్తూ… తాన ప్రధాన ప్రతిపక్షం అనే రీతిలో ఫోజుకొట్టింది. ఇక్కడ గమ్మత్తేమిటంటే… ఈనెల ఏడున ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 18 వరకు కొనసాగాయి. కాకపోతే రెండు రోజులు సభ జరిగితే.. మరో రెండు రోజులు సెలవన్నట్టుగా తతంగం కొనసాగింది. దీంతో ప్రతీరోజూ సాయంత్రం బందోబస్తుకు వచ్చిన పోలీసులు, మీడియా ప్రతినిధులు… ఈ రోజులో సభ ముగుస్తుందా? లేక రేపు కూడా కొనసాగుతుందా? అని ఆరాలు తీయాల్సిన పరిస్థితి. చివరకు సభ ముగిసిన 18 సాయంత్రం సైతం అదే సస్పెన్షన్ కొనసాగింది. 19, 21, 22 కూడా సభ కొనసాగుతుందంటూ కొందరు ధృవీకరించారు కూడా. ఈ లోపు రాత్రి 8 గంటల సమయంలో సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. హమ్మయ్య.. సందిగ్దత వీడింది, సభ ముగిసింది… అని అనుకున్నారంతా… ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయాన్ని నిర్ణయించే సభా సలహా సంఘాని (బీఏసీ)కి అస్సలు ప్రాధాన్యత లేకపోవటం..
-బి.వి.ఎన్.పద్మరాజు
హమ్మయ్య.. ముగిసింది…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


