Thursday, July 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యుత్ అంతరాయాల నివారణకు
 హైడ్రాలిక్ బకెట్ ల్యాడర్ సేవలు ప్రారంభం

విద్యుత్ అంతరాయాల నివారణకు
 హైడ్రాలిక్ బకెట్ ల్యాడర్ సేవలు ప్రారంభం

- Advertisement -

18 సర్కిళ్లకు విస్తరణ : సీఎండీ
 కర్ణాటి వరుణ్‌రెడ్డి
నవతెలంగాణ – నక్కలగుట్ట

వర్షాకాలంలో విద్యుత్ అంతరాయా లను తగ్గించి వినియోగదారులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు టీజీఎన్‌పీడీసీఎల్ హైడ్రాలిక్ బకెట్ ల్యాడర్ సేవలను ప్రారంభిం చింది. హనుమకొండ జిల్లా బాలసముద్రంలోని డివిజన్ పరిధి నక్కలగుట్ట సెక్షన్ ఈఫిల్ టవర్ సర్కిల్‌లో బుధవారం ఈ వాహనాన్ని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెట్ల కొమ్మలు విద్యుత్ లైన్లను తాకడం వల్ల ఏర్పడే అంతరాయాలను నివారించడంలో బకెట్ ల్యాడర్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఎత్తయిన ప్రాంతాల్లో సిబ్బంది భద్రతతో నిర్వహణ పనులు చేపట్టేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం హనుమకొండలో ప్రారంభించిన ఈ సేవలను త్వరలో వరంగల్‌కు విస్తరించనున్నట్టు తెలిపారు. అనంతరం సంస్థ పరిధిలోని అన్ని 18 సర్కిళ్లలో హైడ్రాలిక్ బకెట్ ల్యాడర్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చి విద్యుత్ నిర్వహణను మరింత వేగవంతం చేయనున్నట్టు చెప్పారు. వర్షాకాలంలో అత్యవసర పరిస్థితులకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు వి. మోహన్ రావు, వి. తిరుపతి రెడ్డి, టి. మధుసూదన్, చీఫ్ ఇంజినీర్లు కె. తిరుమల్ రావు, రాజు చౌహన్, అశోక్, హనుమకొండ ఎసఈ బి. సామ్య నాయక్, డీఈ జి. సాంబరెడ్డి, డీఈలు మల్లికార్జున్, అనిల్ కుమార్, భాస్కర్, ఏడీఈ రాజు, ఏఈ ప్రవీణ్, లైన్‌మన్ మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -