Friday, July 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇంటి స్థలాల సదస్సును జయప్రదం చేయండి..

ఇంటి స్థలాల సదస్సును జయప్రదం చేయండి..

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్ : హైదరాబాదులో ఇందిరాపార్క్ వద్ద అర్హులైన పేదల ఇంటి స్థలాల కోసం , ఇందిరమ్మ ఇండ్లు కోసం,  ఈ నెల 6 తేదీ  న  రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, ఆలేరు నుండి వందలాదిమంది పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ ఆలేరు పట్టణంలో శుక్రవారం సిపిఐ పార్టీ కార్యాలయంలో సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. 

 పేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం తగదని, అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలం,  పట్టా ఇల్లు, పది లక్షల రూపాయలు ఇచ్చి పేదవానికి ఇల్లు నిర్మించాలని ప్రభుత్వాన్ని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పారు.

ఈ సమావేశంలో చెక్క వెంకటేష్, చౌడబోయిన కనుకయ్య,  గొట్టిపాముల శ్రీనివాసరాజు, కందుల మధు, అభిబ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -