– బాణాసంచా కాల్చి కాంగ్రెస్ నాయకుల హర్షం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ గ్రామ ప్రజల చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. గ్రామానికి రూ.5 కోట్ల 17 లక్షల వ్యయంతో బైపాస్ బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. గ్రామంలోని తిమ్మాపూర్ రోడ్డు నుంచి అయ్యప్ప స్వామి ఆలయం వెనక నుండి ఏర్గట్ల రోడ్ వరకు బైపాస్ బైపాస్ నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి.బైపాస్ బీటీ రోడ్డు నిర్మాణానికి మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. బైపాస్ రోడ్డు నిర్మాణం ద్వారా గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు గ్రామ అభివృద్ధికి కొత్త ఊపు లభిస్తుందని తెలిపారు.
గ్రామ అవసరం దృష్ట్యా సర్పంచ్ అధ్యక్షతన పంచాయతీ పాలకవర్గం బైపాస్ బీటి రోడ్డు కోసం ప్రతిపాదించి పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ సభ్యుడు వేణుగోపాల్ యాదవ్, నియోజకవర్గ ఇంచార్జి సునీల్ రెడ్డి అప్పగించడం జరిగిందన్నారు. దీంతో వారు స్పందించి రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు.గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని నాయకులు పేర్కొన్నారు.
ఈ బైపాస్ రోడ్డు మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ మెంబర్ బాస వేణుగోపాల్ యాదవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి ఏలేటి మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోనగిరి భాస్కర్, గ్రామ శాఖ అధ్యక్షుడు మారుపాక నరేష్, ఉప సర్పంచ్ తక్కురి శేఖర్, జిల్లా నాయకులు తిప్పిరెడ్డి శ్రీనివాస్, కొమ్ముల రవీందర్, సుంకరి విజయ్, వార్డ్ సభ్యులు రాకేష్, నాయకులు తక్కురి శేఖర్, క్రాంతి రెడ్డి, తిరుమలేష్, రాజేశ్వర్, నాజీర్, పురుషోత్తం, మొకిమ్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.



