Saturday, July 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాంది పలికిన తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాంది పలికిన తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య

- Advertisement -

–  జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
నవతెలంగాణ – కామారెడ్డి
 దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా శనివారం కామారెడ్డి ఐడీఓసీ (IDOC)లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాంది పలికిన తొలి అమరవీరుడని పేర్కొన్నారు. భూమి కోసం, పీడిత ప్రజల హక్కుల సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన మహనీయుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. దొడ్డి కొమురయ్య త్యాగం, ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని కొనియాడారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఎన్.వై. గిరి పాల్గొన్నారు. జిల్లా బీసీ అభివృద్ధి అధికారి నర్సయ్య, బహుజన సంఘాల నాయకులు కొత్తపల్లి మల్లయ్య, జిల్లా అధ్యక్షులు భూమన్న, శ్రీనివాస్, చింతల శంకర్, జిల్లా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, బహుజన సంఘాల ప్రతినిధులు తదితరులు కార్యక్రమంలో పాల్గొని దొడ్డి కొమురయ్యకు నివాళులర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -