- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్ : మండలంలోని పద్మాజి వాడి చౌరస్తాలో శ్రీ గణేష్ మిఠాయి యజమాని రాజు గ్యాస్ ధరలు పెరగడంతో ఆయన ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రత్యామ్నాయంగా గ్యాస్ స్టవ్ ఏర్పాటు చేసుకొని అందులో కాలిపోయిన వాహనాల ఆయిల్ నూనెనుతో స్టవ్ వెలిగిస్తూ దానిపైన మిర్చీలు, పునుగులు బజ్జీలు తయారు చేస్తూ అమ్ముకుంటున్నారు. గ్యాస్ ధర భరించలేక ప్రత్యామ్నాయంగా ఎన్నుకున్నట్టు ఆయన నవతెలంగాణకు తెలిపారు. కాలిపోయిన నూనె 30 రూపాయలకు లీటరు దొరుకుతుందని తెలిపారు. ఆ బండి వద్ద మిర్చీలు తినేవారు ఆ యొక్క పోయిని విచిత్రంగా చూస్తూ పలువురు ఎలా తయారు చేశారని అడుగుతున్నారు.
- Advertisement -



