Friday, August 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేజీబీవీలో స్పాట్ అడ్మిషన్లు..!

కేజీబీవీలో స్పాట్ అడ్మిషన్లు..!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్‌రావు : మండలం మల్లారం గ్రామపరిదిలోగల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి సోమవారం స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్లు స్పెషల్ ఆఫీసర్ ఎం.భవాని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ప్రస్తుతం 6వ తరగతిలో 20 సీట్లు,7వ తరగతిలో 20 సీట్లు,9వ తరగతిలో 03 సీట్లు,ఇంటర్ సిఈసీలో 30 సీట్లు,ఎంపీహెచ్ డబ్యూలో 30 సీట్లు ఉన్నట్టుగా తెలిపారు.అర్హత కలిగిన విద్యార్థినులు తమ ఆధార్ కార్డు,స్టడీ సర్టిఫికెట్,ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టిసి),మార్క్స్ మెమో,కుల ధ్రువీకరణ పత్రం,ఆదాయ ధ్రువీకరణ పత్రం,పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు తదితర అవసరమైన ధ్రువపత్రాలతో సోమవారం ఉదయం పాఠశాలకు హాజరై స్పాట్ అడ్మిషన్ పొందాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -