Saturday, July 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డైరీ టెక్నాలజీ కళాశాల సందర్శించిన 14వ వార్డు కౌన్సిలర్ రామ్ శెట్టి హర్షిత

డైరీ టెక్నాలజీ కళాశాల సందర్శించిన 14వ వార్డు కౌన్సిలర్ రామ్ శెట్టి హర్షిత

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని 14వ వార్డు పరిధిలో ఉన్న డైరీ టెక్నాలజీ కళాశాలను స్థానిక కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా దొడ్ల డైరీ, హైదరాబాద్ ఆధ్వర్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల కింద సుమారు రూ.4 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కళాశాల మొదటి అంతస్తు భవన నిర్మాణ పనులను పరిశీలించారు.. అనంతరం కళాశాలలోని ఇంజినీరింగ్ విభాగం, డైరీ ల్యాబ్‌ను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక డైరీ టెక్నాలజీ కళాశాల కామారెడ్డిలో ఉండటం గర్వకారణమని కౌన్సిలర్ హర్షిత పేర్కొన్నారు.

డైరీ టెక్నాలజీ విద్య ద్వారా దేశ, విదేశాల్లో ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తున్నాయని తెలిపారు. కళాశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి పీజీ డైరీ కోర్సు ఏర్పాటు అంశాన్ని తీసుకెళ్లి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపక బృందం కౌన్సిలర్ రాంశెట్టి హర్షితను శాలువాతో సన్మానించింది. ఈ కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ డా. సురేష్ రాథోడ్, అధ్యాపకులు ఉమాపతి, డా. స్వర్ణలత, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -