నవతెలంగాణ – జన్నారం: పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ కవర్లు వద్దని-ప్రతి ఒక్కరు బట్ట(జూట్) సంచులు వాడాలని జన్నారం ఎఫ్ ఆర్ ఓ వికాస్ అన్నారు. ప్లాస్టిక్ రహిత దినోత్సవ సందర్భంగా మండల కేంద్రంలోని జన్నారం గ్రామపంచాయతీలో ప్లాస్టిక్ వాడకం వలన కలిగే అనర్థాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భం గా ఎస్ఆర్వో వికాస్ మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లు భూమిలో కరగడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుందని, అదే ఒక బట్ట సంచి కేవలం 6 నెలల్లోనే భూమిలో కరుగుతుందని కావున ప్రతి ఒక్కరూ బట్ట సంచులే వాడాలని కోరారు. ఈ సందర్భంగా జన్నారం గ్రామస్తులకు బట్ట సంచులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఎస్ ఓ భోజ నాయక్, సర్పంచ్ అజ్మీర కళావతి నందు నాయక్, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



