నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని ఆయా గ్రామాల్లో ఓటర్లు బూత్ లెవెల్ అధికారులు పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను సమగ్ర వివరాలతో పూర్తిచేసి సకాలంలో తిరిగి బూత్ లెవెల్ అధికారులకు అందించాలని తహసిల్దార్ నరేష్ సూచించారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పర్యవేక్షించారు. కాగా మండలంలో ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ బూత్ లెవల్ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. పత్రాలను నింపి అందజేస్తున్న ఓటర్ల వివరాలను ఆన్ లైన్ లో బిఎల్వోలు పొందుపరుస్తున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో బిఎల్వోలు, బిఎల్ఏలు ఉదయం నుండి వీధుల్లో నిమగ్నం అవుతున్నారు.ఎన్యుమరేషన్ పత్రాలను నింపడంలో ఓటర్లకు ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ,ఎన్యుమరేషన్ పత్రాలు నింపడంలో బిఎల్ఎలు ప్రజలకు సహకరిస్తున్నారు. వివిధ పార్టీల నాయకులు కూడా ఎన్యుమరేషన్ పత్రాలను నింపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకొని ఓటర్లకు సహకారం అందిస్తూ సహాయపడుతున్నారు.
ఎన్యుమరేషన్ ఫారాలు సకాలంలో అందించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



