Saturday, July 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వరదల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కృష్ణ ప్రసాద్

వరదల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కృష్ణ ప్రసాద్

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట
వర్షాకాలంలో వరదల పట్ల అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి కృష్ణ ప్రసాద్ అన్నారు. శనివారం మండల ప్రత్యేక అధికారి కృష్ణ ప్రసాద్ అధ్యక్షతన రైతు వేదిక గోవిందరావుపేట నందు జరిగిన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లో ఈ వర్షాకాలం సీజన్లో రాబోవు వరదల నివారణ చర్యలపై తీసుకునే జాగ్రత్తలు తెలిపినారు. మండలంలో ఎక్కడ కూడా వరదలు సంభవించినప్పుడు ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా ప్రాణ నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.ముందుగానే వరదలు వచ్చినప్పుడు ముంపు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలన్నారు.

వరదలలో అవసరమైన సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆయా సర్పంచుల ద్వారా సలహాలు, సూచనలు తీసుకోనైనది. వారి యొక్క సూచనల మేరకు తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. వరదలు సంభవించినప్పుడు ప్రజా ప్రతినిధులు,అధికారులు, ప్రజలు సమన్వయంతో ప్రమాదాన్ని పసిగట్టి అధిగమించాలన్నారు.ఏ ఒక్కరికీ ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు పటిష్టంగా ఉండాలన్నారు.వరదల సమయంలో అధికారులు పగలు రాత్రి అనకుండా విధులు నిర్వహించాలన్నారు.మన పని తీరుకు గోవిందరావుపేట మండలం ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సృజన్ కుమార్, మెడికల్ ఆఫీసర్ రాము, మండల వ్యవసాయ అధికారి జితేందర్ రెడ్డి, గ్రామ పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -