- Advertisement -
నవతెలంగాణ – ఉప్పునుంతల
మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ (కపాస్ కాంతి) కార్యక్రమంలో భాగంగా పత్తి రైతులకు హెచ్‌డీపీఎస్, ఐసీఎం విత్తనాల పంపిణీ శనివారం ప్రారంభించినట్లు ఉప్పునుంతల మండల వ్యవసాయ అధికారి రమేశ్ తెలిపారు. హెచ్‌డీపీఎస్ విధానంలో పత్తి సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని చెప్పారు. రైతులు శాస్త్రీయ సాగు విధానాలు, సమతుల్య ఎరువుల వినియోగం, సమగ్ర చీడపీడల యాజమాన్యాన్ని పాటించాలని సూచించారు. హెచ్‌డీపీఎస్ విత్తనాలు పొందిన రైతులు అదే విధానంలో సాగు చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
- Advertisement -



