- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వానాకాలం సీజన్‌కు గాను ఆరు ఎకరాల లోపు రైతులకు ‘రైతు భరోసా’ నిధులను విడుదల చేసింది. 5 నుంచి 6 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన 1.68 లక్షల మందికి పైగా లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో రూ. 545.40 కోట్లను ప్రభుత్వం విజయవంతంగా జమ చేసింది. జూన్ 30న ప్రారంభమైన ఈ పెట్టుబడి సాయం పంపిణీ ప్రక్రియ.. ఇప్పటి వరకు రైతు భరోసా పథకం కింద మొత్తం 67.45 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,135.78 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. అర్హులైన ప్రతి రైతుకు దశలవారీగా రైతు భరోసా సాయాన్ని అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
- Advertisement -



