Saturday, July 4, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఘనంగా జోగురామన్న జన్మదిన వేడుకలు

ఘనంగా జోగురామన్న జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జోగు రామన్న జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అట్టహాసంగా జరుపుకున్నారు. తమ అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు శనివారం పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ముందుగా కేక్ను కట్ చేసి జోగు రామన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకరికోకరు కేక్ తినిపించుకున్నారు. జై జోగు రామన్న… జై తెలంగాణ అంటు పెద్ద పెట్టున నినాదాలతో పార్టీ కార్యాలయం హోరెత్తింది. ఇదిలా ఉంటే తమ అభిమాన నాయకుడు జోగు రామన్న జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో రిమ్స్ ఆడిటోరియంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వచ్చందంగా రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా యువజన విభాగం అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ… తమ నాయకుడి జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఒక్కరి రక్తదానం ముగ్గురి ప్రాణాలను కాపడుతుందని, అందుచేతనే ప్రతి ఒక్కరు అత్యవసర సమయాల్లో రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మెట్టు ప్రహ్లాద్, నారాయణ, యాసం నర్సింగ్ రావు, యూనీస్ అక్బానీ, సాజిదొద్దీన్, అజయ్, మనోహర్, సర్సన్ లింగారెడ్డి, ప్రమోద్ రెడ్డి, గండ్రతమేష్, చంద్రల రాజన్న, పవన్ నాయక్, కస్తాల ప్రేమల, స్వరూప, మమత, పర్వీన్ సుల్తాన పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -