Saturday, July 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రక్తదాన శిబిరం ప్రారంభించిన జిల్లా ఎస్పీ

రక్తదాన శిబిరం ప్రారంభించిన జిల్లా ఎస్పీ

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ ఆధ్వర్యంలో మండలంలోని రామేశ్వర్‌పల్లి గ్రామ పంచాయతీ సంయుక్తంగా శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎస్.పీ. రాజేష్ చంద్ర ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి మరెందరికో ప్రాణాలు కాపాడాలని పిలుపునిచ్చారు. సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, సిఐ నరేష్, ఎస్సై ఆంజనేయులు, గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు, ఉపసర్పంచ్ వినోద్ గౌడ్, తెలంగాణ సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డా. సుధాకర్ గౌడ్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా. అంజయ్య, డా. హరిత, డీఎస్పీ మధుసూదన్, పీహెచ్‌సీ వైద్యాధికారి డా. ఏమీమా, వార్డు సభ్యులు, రెడ్ క్రాస్ సొసైటీ కోఆర్డినేటర్ బాలు, ప్రజాప్రతినిధులు, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు, పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -