– స్టెప్పులతో అదరగొట్టిన సీతక్క..
నవతెలంగాణ – డిచ్ పల్లి
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధన సూరి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన భవనాలను ప్రారంభించారు.ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి లో నిర్వహించిన సభలో బంజారా పాటల పై గిరిజనుల వేషధానాలతో ఉన్న విద్యార్థినులతో కలిసి మంత్రి సీతక్క బంజారా జానపద గీతాలకు విద్యార్థుల కేరింతలతో నృత్యం చేసి అందరినీ మంత్రముగ్ధుల్ని చేసి ఆకట్టుకున్నారు. ఒకపక్క వర్షం పడుతున్న విద్యార్థినీలు అలాగే కూర్చుండడంతో మంత్రి పలుమార్లు వారికి సైగలు చేసి స్టేజి పైకి రావాలని అభ్యర్ధించారు. స్టేజ్ పై మంత్రి స్టె ప్పులు వేస్తుంటే కింద ఉన్న విద్యార్థుల సైతం స్టెప్పులు వేయడం చూసినవారికి ఆనందాన్ని కలిగించింది.
బంజారా చిన్నారులతో నృత్యం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



