Saturday, July 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రవేట్ పాఠశాలల నిర్వహణపై  అధికారుల పర్యవేక్షణ కరువు 

ప్రవేట్ పాఠశాలల నిర్వహణపై  అధికారుల పర్యవేక్షణ కరువు 

- Advertisement -

నవతెలంగాణ–అచ్చంపేట: డివిజన్ పరిధిలో నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు కఠిన పర్యవేక్షణ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ కన్వీనర్ చరణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మండల విద్యాధికారి శ్రీనివాసమూర్తికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ పట్టణంలోని పలువురు ప్రైవేటు విద్యాసంస్థలు విద్యా హక్కు చట్టం (ఆర్‌టీఈ) నిబంధనలను అమలు చేయడం లేదని ఆరోపించారు. నిబంధనల ప్రకారం పాఠశాలల్లో పుస్తకాలు, నోట్‌బుక్లు, టైలు, బెల్టులు, యూనిఫారాలు, షూలు విక్రయించకూడదని ఉన్నప్పటికీ, యాజమాన్యాలు వాటిని విద్యార్థులకే విక్రయిస్తున్నాయని విమర్శించారు.

అదేవిధంగా పాఠశాలల్లో తప్పనిసరిగా ఉండాల్సిన మరుగుదొడ్లు, బాత్రూమ్‌లు, తాగునీటి సౌకర్యం, ఆటస్థలం, అగ్నిమాపక భద్రత వంటి మౌలిక వసతులు అనేక చోట్ల సక్రమంగా లేవని పేర్కొన్నారు. అగ్నిమాపక శాఖ అనుమతులు కూడా లేకుండానే కొన్ని పాఠశాలలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం పాఠశాలలు విద్యాసంస్థల్లా కాకుండా బట్టల దుకాణాలు, పుస్తకాల దుకాణాల్లా మారిపోయాయని విమర్శించారు. అడ్మిషన్ల పేరుతో విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని, గత విద్యా సంవత్సరంలో నర్సరీ విద్యార్థులకు రూ.12 వేలు వసూలు చేసిన యాజమాన్యాలు ఈ విద్యా సంవత్సరంలో రూ.18 వేలు తీసుకుంటున్నాయని తెలిపారు. విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -