Saturday, July 4, 2026
E-PAPER
Homeఆదిలాబాద్నష్టపరిహారం అందించాలి...

నష్టపరిహారం అందించాలి…

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హత్నూర్: మండల కేంద్రంనికి చెందిన రైతులు సాగుచేసినటువంటి తేజస్విని సోయాబిన్ వి త్తనాలు సరిగ్గా మొలకెత్తకపోవటంతో నష్టపరిహారం చెల్లించాలని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ పెట్టుబడులు పెట్టి విత్తనాలు కొనుగోలు చేసి వేసిన విత్తనాలు ఆశించిన స్థాయిలో స్థాయిలో మొలకలు రాకపోవటంతో తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు. నాసిరకం విత్తనాల కారణంగా ఈ పరిస్థితి నెలకొన్నది అని ఆరోపించిన రైతులు సంబంధిత విత్తనాల కంపెనీ పై సమగ్రంగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పంట నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఎమ్మార్వో శ్యామ్ సుందర్కు , ఏఈఓ సంతోష్ కు వినతి పత్రం అందించారు.రైతుల సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం అందజేసిన రైతులు తోకల విఠల్, చంద్రశేఖర్, ప్రభాకర్, సంజీవ్, శ్రీనివాస్, శివ, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -