- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
గ్రామాలు అభివృద్ధికి పట్టుకొమ్మలు వార్డు సభ్యులేనని శిక్షణాధికారి అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో 11 గ్రామ పంచాయతీల పరిధిలోని వార్డు సభ్యులకు సోమవారం నుండి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో 100 మంది వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వార్డు సభ్యుల అధికారాలు, గ్రామ అభివృద్ధికి చేపట్టవలసిన విధుల గురించి వివరించారు. ఈ క్లాసులు మండల అభివృద్ధి అధికారి రాణి, మండల పంచాయతీ అధికారి వెంకట నరసయ్య పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల వార్డు సభ్యులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
- Advertisement -



