- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : ప్రజాసేవకే నా జీవితం అంకితమని, ప్రజల సమస్యల పరిష్కారానికై నిర్విరామ కృషి చేస్తానని ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ శనివారం తెలిపారు. అందరిని ఉన్నత స్థాయికి చేర్చేది విద్య కాబట్టి ఆర్థికంగా వెనుకబడి ఉన్నత చదువులు చదివే వారికి కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నానని తెలిపారు. అతి త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నానని , విద్యా వైద్యానికే ప్రాధాన్యత ఇస్తామని , ప్రజలు కూడా మంచి విద్యావంతులైన వారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరినారు. మంచి నాయకులు ఉంటే నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేసినారు.
- Advertisement -



