Sunday, July 5, 2026
E-PAPER
Homeసినిమాపైరసీ చేస్తే కఠిన చర్యలు

పైరసీ చేస్తే కఠిన చర్యలు

- Advertisement -


పైరసీ సినిమాలు, ఆడియో- విజువల్ కంటెంట్ వ్యాప్తి విషయంలో టెలిగ్రామ్ తగు జాగ్రత్తలు తీసుకోవాలని లేని పక్షంలో కాపీరైట్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సి.సెంథిల్ రాజన్ ఓ ప్రకటనను విడుదల చేశారు.
ఈ నేపథ్యంలో విడుదల చేసిన ప్రకటనలో ఆయన చాలా విషయాలను ప్రస్తావించారు. ‘కొత్తగా విడుదలైన సినిమాలు సహా అనేక పైరసీ సినిమాలు టెలిగ్రామ్ లోని పబ్లిక్ ఛానల్స్, గ్రూపుల ద్వారా అనధికారికంగా కాపీ అవుతున్నాయి. అలాగే హోస్ట్, స్ట్రీమ్, పంపిణీ చేయబడుతున్నాయి. అలాగే షేర్ చేస్తున్నారు. ఇలాంటి పైరసీ సినిమా, కాపీ రైట్ ఉల్లంఘనకు గురైన ఆడియో, విజువల్ కంటెంట్ వ్యాప్తి వల్ల సృష్టికర్తలు, కాపీరైట్ యజమానులు, నిర్మాతలు, పంపిణీదారులు, ప్రసార సంస్థలు, ఆన్ లైన్ క్యూరేటెడ్ కంటెంట్ ప్రచురణకర్తలు, ఇతర సంబంధిత వర్గాలకు తీవ్రమైన ఆర్థిక నష్టం కలుగుతోంది. అంతేకాకుండా భారతదేశ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ, చట్టబద్ధమైన డిజిటల్ కంటెంట్ వ్యవస్థ, మేధో సంపత్తి హక్కులకు టెలిగ్రామ్ ద్వారా ప్రతి కూల ప్రభావం పడుతోందని భారత ప్రభుత్వం గమనించింది. అందువల్ల పై పేర్కొన చర్యలు 1957 కాపీరైట్ చట్టం, 1952 సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం నేరంగా పరిగణించబడతాయి. అలాగే పైరసీ నిరోధించడానికి, అది వ్యాప్తి చెందకుండ ఉండటానికి, ఇప్పటికే తొలగించిన కంటెంట్ ని మళ్లీ అప్ లోడ్ చేయకుండా ఉంటానికి టెలిగ్రామ్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే విషయాలపై సమగ్రంగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది` అని ప్రకటనలో సెంథిల్ కుమార్ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -