జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్లో నటిస్తున్న సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ మూవీ ‘కిల్లర్`. మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ధ్యానం నాన్న ఆశీస్సు లతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్, పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తు న్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరి స్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. వీఎఫ్ఎక్స్ వర్క్స్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
శనివారం హీరోయిన్ జ్యోతి పూర్వజ్ బర్త్ డే సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ లో సూపర్ వుమెన్ గా, మిస్టీరియస్ వుమెన్ గా జ్యోతి పూర్వజ్ ఎలక్ట్రిఫైయింగ్ లుక్స్ లో కనిపించి ఆకట్టుకుంటున్నారు.
మెలిఫిసెంట్ మూవీలో ఏంజెలీనా జోలిని తలపిం చేలా జ్యోతి పూర్వజ్ లుక్స్ ఉండటం విశేషం. ఈ సినిమాలో సూపర్ షీ క్యారెక్టర్ లో జ్యోతి పూర్వజ్ నటన ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయనుంది. ఈ సినిమాలో ప్రేక్షకులు మర్చిపోలేని ఒక ప్రపంచాన్ని డైరెక్టర్ పూర్వాజ్ క్రియేట్ చేస్తున్నారు. ఆయన ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు సీఎన్ఏ ఇంటిగ్రేషన్, రాయ్ ప్రోటోకాల్ కోసం వర్క్ చేసే సైంటిస్ట్ గా కనిపించబోతున్నారు అని చిత్రయూనిట్ తెలిపింది.
సరికొత్త సై ఫై థ్రిల్లర్
- Advertisement -
- Advertisement -



