Sunday, July 5, 2026
E-PAPER
Homeసినిమాప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది

ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది

- Advertisement -

విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు జంటగా శరత్ చంద్ర నాయుడు నిర్మించిన సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’. వినోద్ గాలి తెరకెక్కించారు. ఈ సిరీస్ ప్రస్తుతం ఈటీవీ విన్‌లో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో విజయోత్సవ వేడుకను నిర్వహించారు.
విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ,’నేను కొత్తగా ప్రయత్నించిన ప్రతీ సారి తెలుగు ఆడియెన్స్ నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ సిరీస్‌కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని చాలా భయపడ్డాను. కానీ సిరీస్ బయటకు వచ్చాక.. అందరూ ఫోన్స్ చేసి ప్రశంసిస్తున్నారు. నవ్వాం, ఏడ్చాం.. ఇలాంటి పాత్రను చేసినందుకు థాంక్స్ అని నాతో చెప్పి పొగుడుతున్నారుఅని తెలిపారు. 'ఏడాదిన్నర పాటుగా ఈ సిరీస్ మా నిద్రలేని రాత్రుల్లో, మా చర్చల్లో ఉంది. కానీ ఇప్పుడు ప్రతీ ఒక్కరి గుండెల్లో ఉంది. చూసిన ప్రతీ ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. చాలా ఏళ్ల తరువాత ఓ మంచి సిరీస్ చూశామని అంటున్నారు. విరాజ్ పర్ఫామెన్స్ సిరీస్‌ను నిలబెట్టేసింది. చివరి రెండు ఎపిసోడ్స్ గురించి అందరూ గొప్పగా మాట్లాడు కుంటున్నారు అని నిర్మాత శరత్ చంద్ర నాయుడు చెప్పారు. ఈటీవీ వైస్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ మాట్లాడుతూ,’90స్’ సిరీస్‌తో మా ఈటీవీ విన్‌ గతిని తెలుగు ప్రేక్షకులు మార్చేశారు. ఈ సిరీస్ కూడా.. గుర్తు చేస్తుంది, గుర్తుండిపోతుంది` అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -