Sunday, July 5, 2026
E-PAPER
Homeసినిమామరో భిన్న ప్రేమకథ

మరో భిన్న ప్రేమకథ

- Advertisement -

ఈవీవీ సినిమా పతాకంపై తాజాగా ఓ వైవిధ్యమైన కథ, కథనాలతో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లెజెండరీ దర్శకుడు ఈ.వీ.వీ. సత్యనారాయణ స్థాపించిన ఈ బ్యానర్‌పై గతంలో ‘చాలా బాగుంది’, ‘మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది’, ‘తొట్టి గ్యాంగ్’, ‘అత్తిలి సత్తిబాబు ఎల్‌కేజీ’, ‘ఫిట్టింగ్ మాస్టర్’, నువ్వంటే నాకిష్టం, కితకితలు వినోదాత్మక చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి.
ఇప్పుడు ఈ బ్యానర్‌పై ఈవీవీ తనయుడు ఆర్యన్‌ రాజేష్‌, మరో నిర్మాత ఎన్‌.వి.కృష్ణారెడ్డితో కలిసి ఓ సినిమా నిర్మంచబోతున్నారు.
నిజ జీవిత కథ ఆధారంగా ఓ ఇంటెన్స్ లవ్ డ్రామాగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హర్ష్ రోషన్ హీరోగా, ప్రియాంక ఆచర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
‘కోర్ట్’ చిత్రంతో మంచి ప్రశంసలు అందుకున్న హర్ష్ రోషన్, తెలుగు సినిమాలో ప్రతిభావంతులైన యువ నటుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు మరో భావోద్వేగ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఈ చిత్రానికి అరుణ్ బాలాజీ, శ్రీ రంజని సంయుక్తంగా దర్శకత్వం వహిస్తారు. నిజ జీవిత భావోద్వేగాలు, సంబంధాల నేపథ్యంలో ఈ ప్రే కథను వారు రూపొందించారు.
ఈ సినిమా ఇటీవల శుభ ముహూర్తంలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. త్వరలోనే చిత్రీ కరణ ప్రారంభం కానుంది. ఈవీవీ సినిమా, ఎన్‌వీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భిన్న ప్రేమకథా చిత్రానికి నిర్మాతలు: ఎన్.వి. కృష్ణారెడ్డి, ఆర్యన్ రాజేష్, దర్శకులు: అరుణ్ బాలాజీ, శ్రీ రంజని, డీఓపీ: జిజు సన్నీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినీల్ నల్లమిల్లి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -