- Advertisement -
రూ.5 కోట్ల 833 కిలోల డ్రగ్స్ దహనం :సైబరాబాద్ డీసీపీ
ముత్యంరెడ్డి వెల్లడి
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 101 ఎన్‌డీపీఎస్ కేసుల్లో పట్టుబడిన రూ.5.02 కోట్ల విలువైన 833.118 కిలోల మాదక ద్రవ్యాలను పోలీసులు శనివారం దహనం చేశారు. సీపీ ఎం.రమేశ్ ఆదేశాలతో డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మెన్, డీసీపీ ఏ.ముత్యంరెడ్డి ఆధ్వర్యంలో నందిగామ మండలం ఎదులపల్లిలోని జీజే మల్టీక్లేవ్ సంస్థలో పర్యావరణ నిబంధనల ప్రకారం ఇన్సినరేటర్‌లో డ్రగ్స్‌ను ధ్వంసం చేశారు. మొత్తం 7 రకాల డ్రగ్స్‌ను 8వ విడతలో భాగంగా దహనం చేశారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం కఠిన చర్యలు కొనసాగిస్తామని డీసీపీ ముత్యంరెడ్డి తెలిపారు.
- Advertisement -



