- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ (సర్) లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు తమ ఫారాన్ని బి ఎల్ ఓ కు వ్రాసి అందించాలని ఆర్ఐ నరేష్ తెలిపారు. మండలంలోని పోసానిపేటలో ఆదివారం ఆయన సర్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఈ ప్రక్రియలో తప్పకుండా పాల్గొనాలని, ఒకవేళ పాల్గొని నీ యెడల ఓటర్ లిస్ట్ నుండి పేరు తొలగించబడునని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ సుద్దాల లింగం, బి ఎల్ వో లు, నాయకులు బాపురెడ్డి, టంకర్ రవి, తిరుపతి, తదితరులు ఉన్నారు.
- Advertisement -



