నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రంలోని పలువురు లబ్ధిదారుల ఇందిరమ్మ గృహ నిర్మాణలను జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ రాము సోమవారం క్షేత్రస్థాయి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలోని 30 గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలను త్వరితగతిన చేపట్టాలని లబ్ధిదారులకు సూచించారు. ప్రతి ఒక్క లబ్ధిదారుడు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గృహ నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. నిర్మాణాలలో నిబంధనలు ఉల్లంఘించిన యెడల బిల్లులు మంజూరు కావని చెప్పారు. మంజూరైన నాటినుండి గడువులోగా నిర్మాణాలను పూర్తి చేయాలని తెలిపారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు మూడు విడతలుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు ఎంపీ ఓ, జుక్కల్ గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, జిపిఓ శ్రీకాంత్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ, ఎంపీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



