Monday, July 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులకు పత్తి విత్తనాల పంపిణీ

రైతులకు పత్తి విత్తనాల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల
మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ (కపాస్ కాంతి) కార్యక్రమంలో భాగంగా ఉప్పునుంతల మండలం పిరట్వానిపల్లి గ్రామ రైతు వేదికలో సోమవారం పత్తి రైతులకు హెచ్‌డీపీఎస్ (HDPS), ఐసీఎం (ICM) విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కొర్ర రమేష్ రైతులకు పత్తి సాగులో ఆధునిక సాగు విధానాలు, అధిక దిగుబడులు సాధించే పద్ధతులు, విత్తనాల ఎంపిక, సరైన దూరంలో విత్తడం, ఎరువుల వినియోగం, చీడపీడల నివారణపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. రైతులు నాణ్యమైన విత్తనాలతో శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిరట్వానిపల్లి గ్రామ సర్పంచి సుప్రియ, అయ్యవారిపల్లి గ్రామ సర్పంచి జిల్లేల జగత్‌రెడ్డి, ఏఈఓ, వ్యవసాయ శాఖ సిబ్బంది, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -