Wednesday, March 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపారామెడికల్‌ సర్టిఫికెట్లు ఇప్పించండి

పారామెడికల్‌ సర్టిఫికెట్లు ఇప్పించండి

- Advertisement -

సూర్యాపేట జిల్లా గ్రామీణ వైద్యుల సంఘం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

గ్రామీణ వైద్యలకు పరీక్షలు నిర్వహించి కమ్యూనిటీ పారా మెడికల్‌ సర్టిఫికెట్స్‌ ఇప్పించాలని సూర్యాపేట జిల్లా గ్రామీణ వైద్యుల సంఘం కోరింది. ఈ మేరకు మంగళవారం టీపీసీసీ అధికార ప్రతినిధి ఎ.జ్ఞాన సుందర్‌తో కలిసి సంఘం నాయకులు జెరిపోతుల లక్మణ్‌ గౌడ్‌, డాంగే రాజేందర్‌లు టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి జీవో నెంబర్‌ 1274ను విడుదల చేసి గ్రామీణ వైద్యులకు శిక్షణ, సర్టిఫికెట్లు ఇవ్వాలని ప్రతిపాదించారని వారు గుర్తుచేశారు. ఆ క్రమంలో 104,108 అంబులెన్సులో ప్రాక్టికల్స్‌ పూర్తి చేయించారని తెలిపారు. శిక్షణ పూర్తి ఆయిన వారికి పరీక్షలు నిర్వహించి. కమ్యూనీటి పారా మెడికల్‌ సర్టిఫికెట్స్‌ ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. అయితే వైఎస్సాఆర్‌ అకాల మరణంతో శిక్షణ ఆగిపోయిందని పేర్కొన్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -