Monday, July 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏరియా ఆస్పత్రిలో ఉచిత టీకాలు 

ఏరియా ఆస్పత్రిలో ఉచిత టీకాలు 

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్ 
పట్టణ ఏరియా వెటర్నరీ హాస్పిటల్ యందు సోమవారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ఉచిత టీకాలు ఇవ్వడం జరిగిందని వెటర్నరీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్  ఎం జియాయుద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే అంటూ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, నివారణ చర్యలను ప్రోత్సహించడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం అని, కుక్కలతో పాటు కోతులు, గబ్బిలాలు, ఎలుకలు కరిచిన వెంటనే వైద్యులను సంప్రదించి యాంటీ రేబిస్ టీకాలు తీసుకోవాలని సూచించారు. జూనోటిక్ వ్యాధుల నివారణకు పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించి ఆరోగ్య పరీక్షలు చేయించాలని, జంతువులను తాకిన తర్వాత చేతులు శుభ్రంగా  కడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ హాస్పిటల్ వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -