ఎంత శుభ్రం చేసుకున్నా, ఎన్ని జాగ్రత్తలు పాటించినా సరే.. కొంత మంది ముఖం జిడ్డుగానే ఉంటుంది. మాయిశ్చరైజర్తోపాటు మార్కెట్లో దొరికే అనేక రకాల క్రీములు వాడినా ఫలితం ఉండదు. ఇక జిడ్డు చర్మానికి తోడు మొటిమలు, మచ్చలు ఇబ్బందిపెడుతుంటాయి. దీంతో ఏం చేయాలో తెలియక తమలో తామే బాధపడుతుంటారు. అయితే జిడ్డు సమస్యతో ఇబ్బందిపడేవారు.. ఈ టిప్స్ పాటించడం వల్ల ఈజీగా బయటపడొచ్చని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.
గ్రీన్ టీ: గ్రీన్ టీ కేవలం ఆరోగ్యానికే కాకుండా జిడ్డును తొలగించడానికి కూడా ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. 2015లో జర్నల్ ఆఫ్ కాస్మోటిక్ డెర్మటాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. గ్రీన్ టీలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. సీబమ్ ఉత్పత్తిని తగ్గిస్తాయని.. తద్వారా జిడ్డు తగ్గుతుందని కనుగొన్నారు. అంతేకాకుండా గ్రీన్ టీలో ఉండే ఇతర పోషకాలు చర్మాన్ని మృదువుగా చేసి, చర్మం వాపు తగ్గిస్తుందని, మొటిమలు తగ్గిస్తుందని పేర్కొన్నారు.
ఇవీ కూడా: గ్రీన్ టీ మాత్రమే కాకుండా పాలు కూడా జిడ్డు తొలగిస్తాయని నిపుణులు అంటున్నారు. అందుకోసం పాలను ముఖానికి అప్లై చేసుకొని పావుగంటయ్యాక కడిగేసుకోవాలని.. ఫలితంగా చర్మంపై జిడ్డుదనం తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అలానే జిడ్డుకు కారణమయ్యే సీబమ్ ఉత్పత్తి కూడా అదుపులోకి వస్తుందని వివరిస్తున్నారు.
జిడ్డు చర్మానికి…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



