Monday, July 6, 2026
E-PAPER
Homeమానవిజిడ్డు చర్మానికి…

జిడ్డు చర్మానికి…

- Advertisement -

ఎంత శుభ్రం చేసుకున్నా, ఎన్ని జాగ్రత్తలు పాటించినా సరే.. కొంత మంది ముఖం జిడ్డుగానే ఉంటుంది. మాయిశ్చరైజర్​తోపాటు మార్కెట్​లో దొరికే అనేక రకాల క్రీములు వాడినా ఫలితం ఉండదు. ఇక జిడ్డు చర్మానికి తోడు మొటిమలు, మచ్చలు ఇబ్బందిపెడుతుంటాయి. దీంతో ఏం చేయాలో తెలియక తమలో తామే బాధపడుతుంటారు. అయితే జిడ్డు సమస్యతో ఇబ్బందిపడేవారు.. ఈ టిప్స్ పాటించడం వల్ల ఈజీగా బయటపడొచ్చని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.
గ్రీన్​ టీ: గ్రీన్​ టీ కేవలం ఆరోగ్యానికే కాకుండా జిడ్డును తొలగించడానికి కూడా ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. 2015లో జర్నల్​ ఆఫ్​ కాస్మోటిక్​ డెర్మటాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. గ్రీన్ టీలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. సీబమ్​ ఉత్పత్తిని తగ్గిస్తాయని.. తద్వారా జిడ్డు తగ్గుతుందని కనుగొన్నారు. అంతేకాకుండా గ్రీన్ టీలో ఉండే ఇతర పోషకాలు చర్మాన్ని మృదువుగా చేసి, చర్మం వాపు తగ్గిస్తుందని, మొటిమలు తగ్గిస్తుందని పేర్కొన్నారు.
ఇవీ కూడా: గ్రీన్​ టీ మాత్రమే కాకుండా పాలు కూడా జిడ్డు తొలగిస్తాయని నిపుణులు అంటున్నారు. అందుకోసం పాలను ముఖానికి అప్లై చేసుకొని పావుగంటయ్యాక కడిగేసుకోవాలని.. ఫలితంగా చర్మంపై జిడ్డుదనం తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అలానే జిడ్డుకు కారణమయ్యే సీబమ్‌ ఉత్పత్తి కూడా అదుపులోకి వస్తుందని వివరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -