నవతెలంగాణ – స్టేషన్ ఘనపూర్:-
మున్సిపాలిటీ పరిధిలో చాగల్లులోని ఓ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్, ఓ వృద్ధమహిళపై అత్యాచారానికి యత్నించినట్లు సోషల్ మీడియా వేదికగా సోమవారం రాత్రి చక్కర్లు కొడుతున్నాయి. సదరు మహిళ ఫిర్యాదు మేరకు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసు నేపథ్యంలో నిందితుడు పోలీసు కస్టడీలో ఉన్నట్లు సమాచారం. అయితే, దీనిపై పోలీసులు అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
ఈ సందర్భంగా పలువురు మహిళలపై నేరాల కేసుల్లో చట్టం తన పని తాను చేసుకోవాలని, రాజకీయ హోదా లేదా పదవి ఎవరికీ రక్షణగా మారకూడదని స్థానికులు, ఇతర పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు. కేసుపై నిష్పక్షపాత దర్యాప్తు జరిపి, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని, బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా, కేసులో ఆరోపణలు దర్యాప్తు అనంతరం కోర్టులో రుజువైతే సంబంధిత ప్రజాప్రతినిధిపై పార్టీ, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు
కాంగ్రెస్ కౌన్సిలర్ పోలీసు కస్టడీలో..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



