మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్వహించిన పనులపై 14వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎల్లుండి 16వ తారీకు శనివారం ఉదయం పది గంటల నుంచి నిర్వహించినట్లు ఈజీఎస్ ఇన్చార్జి ఏపిఓ టి అనిల్ ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో 01 ఏప్రిల్ 2022 నుంచి 31 మార్చ్ 2023 వరకు నిర్వహించిన పనులపై కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు సకాలంలో హాజరుకావాలని కోరారు.