- Advertisement -
హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్లు, కలెక్టర్ విచారణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలపై సోమవారం హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్లు ఏవీ రంగనాథ్, ఆర్‌వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ డా. ప్రియాంక అలా, అధికారులు పరిశీలించారు. తమ నుంచి ఎలాంటి అనుమతులూ తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టారని ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో విచారించారు. ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ చేపట్టిన భవన నిర్మాణానికి తమ నుంచి ఎలాంటి అనుమతులూ లేవని ఇరిగేషన్ శాఖ ఈ సందర్భంగా తెలిపింది. ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ అనంతరం సంబంధిత రికార్డులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు తెలిపారు.
- Advertisement -



