- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
మండలంలో ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. మంగళవారం రేకులపల్లి గ్రామములో జరుగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల స్వీకారణ కార్యక్రమాన్ని తహసీల్దార్ శాంత పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. తప్పులు లేకుండా జాగ్రత్తగా ఫారాలు నింపాలని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్క ఓటరు తమ తమ ఫారాలు నింపి సకాలంలో అందించాలని కోరారు. కార్యక్రమములో ఆర్ఐ రాజేశ్వర్, పంచాయతీ కార్యదర్శి, జిపిఓ గణేష్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



