- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి దండిగా మల్లన్న ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ అబ్బినేని లింగస్వామి మంగళవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.3 వేలు ఆర్థిక సాయం అందించి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అక్కల దేవేందర్, అక్కల మహేష్, అక్కల బాపు, రాము, అబ్బినేని తిరుపతి, హరీష్ వర్ధన్, పోచంపెల్లి కత్తెరసాల పాల్గొన్నారు.
- Advertisement -



