Tuesday, July 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్ల హైస్కూల్లో తీరిన విద్యుత్ కష్టాలు

తాడిచెర్ల హైస్కూల్లో తీరిన విద్యుత్ కష్టాలు

- Advertisement -

మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయ బృందం 
నవతెలంగాణ – మల్హర్ రావు

మండల కేంద్రమైన తాడిచెర్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో మంది 220 విద్యార్థులు విద్యానభ్యసిస్తున్నారు. వీరికి ఫ్యాన్స్, ల్యాబ్, కంప్యూటర్స్, డిజిటల్ తరగతులు, ఆర్వో ప్లాంట్, బోర్ వెల్ తదితరవి నిర్వహించడానికి గత నాలుగేళ్లుగా చీటికీమాటికి విద్యుత్ సమస్యలతో విద్యార్థులకు ఇబ్బందులకు గురైయ్యారు. ఈ సమస్యను ప్రాధానోపాధ్యాయుడు తిరుపతి, ఉపాధ్యాయులు మాజీ ఎంపిపి  చింతలపల్లి మలహల్ రావు, స్థానిక సర్పంచ్ బండి స్వామి సంయుక్తంగా మంత్రి శ్రీదర్ బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ దృష్టికి తీసుకపోగా వెంటనే మంత్రి తాడిచెర్లలో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ సిఎస్ఆర్ నిధుల నుంచి రూ.3.17.385 లక్షల నిధులు మంజురు చేయడంతో తాడిచర్ల జూనియర్ లైన్ మెన్ మహేందర్ ఆధ్వర్యంలో కరెంట్ స్తంభాలు పాతి ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ ను బిగించి, వైర్ గుంజి కనెక్షన్ ఇవ్వడం జరిగిందని దీంతో కరెంట్ కష్టాలు తిరాయని ఇందుకు మంత్రి శ్రీదర్ బాబు, కలెక్టర్, ఏఎమ్మార్ కంపెనీ, మాజీ ఎంపిపి, సర్పంచ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -