నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామీణ ప్రజలకు జిల్లా కలెక్టరేట్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే ప్రజావాణి సేవలు అందుబాటులోకి తెస్తూ, ప్రజలకు దూరబారం, రవాణా ఛార్జీలు, పనిదినం నష్టం వంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల కేంద్రమైన తాడిచెర్లలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ, నోడల్ అధికారి క్రాoతి కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి స్పందన కరువైంది. మండల వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ శాఖకు సంబంధించిన కేవలం రెండు అర్జీలు మాత్రమే వచ్చినట్టుగా నోడల్ అధికారి తెలిపారు.ప్రజావాణిలో మొత్తం 27 శాఖల అధికారులు హాజరు కావాలి కానీ 15 శాఖలకు సంబంధించిన అధికారులు హాజరై,హార్టీకల్చర్, పిషరీప్,టిజిఎన్పిసిసిఎల్,వాటర్ డిపార్ట్మెంట్,బిసి వెల్పేర్ తదితర శాఖల అధికారులు గైహాజరైయ్యారు.
ప్రజావాణి’కి నిధుల గండం..
కరోనాకు ముందు తహసీల్దార్ కార్యాలయాల్లో జన వాణి(ప్రజావాణి) నిర్వహించేవారు. క్షేత్రస్థాయిలో ఆదరణ లభించక దానిని రద్దు చేశారు. ప్రస్తుతం ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహించాలని ఆదేశించినా ప్రత్యేక నిధులు కేటాయించలేదు.ఇంకా 16వ ఆర్థిక సంఘం నిధులు పెండింగ్లో ఉన్నాయి. కొన్ని మండలాల్లో ప్రింటర్లు, స్కానర్లు, ఇన్వర్టర్లు లేవు.మరికొన్ని చోట్ల అసలు మరుగుదొడ్లే సరిగా లేవు.నెలలో నాలుగైదు సార్లు ప్రజావాణి నిర్వహిం చాల్సి ఉంటుంది.అధికారులకు కనీసం టీ,స్నాక్స్,ప్రజలకు తాగునీరు,నీడ,మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించేందుకు నిధులు సమకూర్చుకోవడంపై ఎంపీడీవోలు ఆందోళన చెందుతున్నారు. కొత్తగా ఏర్పడిన నూతన మండలాలు పలిమేల,గోరికొత్తపల్లిలో పక్కా ఎంపీడీవో కార్యాల యాలు లేవు.ఇప్పటికే అధికారులు ఇబ్బంది పడుతున్నారు.



